కరోనా మృత్యుకల్లోలం!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా మృత్యుకల్లోలం!

ఒక్కరోజులో 4,187 మంది మృతి
  మళ్లీ 4 లక్షలు దాటిన కేసులు
13 రాష్ట్రాల్లో వందకుమించిన ప్రాణనష్టాలు

ఈనాడు, దిల్లీ: కరోనా కల్లోలం అంతకంతకూ ఉగ్రరూపం దాలుస్తోంది. దేశంలో రోజువారీ మరణాల సంఖ్య శనివారం తొలిసారిగా 4 వేలు దాటిపోయింది. అమెరికా, బ్రెజిల్‌ తర్వాత ఒక రోజులో ఇంత భారీసంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నది ఇక్కడే. తొలి ఉద్ధృతిలో వందకుపైగా మరణాలు సంభవించిన రాష్ట్రాలు మహారాష్ట్ర తర్వాత ఒకటి, రెండు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 13 రాష్ట్రాల్లో ఆ పరిస్థితి నెలకొంది. గత 24 గంటల్లో 4,187 మరణాలు సంభవించగా అందులో 86.05% ఈ రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయి.
* దేశంలో వరుసగా మూడో రోజు కొత్త కేసుల సంఖ్య 4 లక్షలు దాటింది (4,01,078). శనివారం నాటికి మొత్తం కేసుల సంఖ్య దాదాపు 2.19 కోట్లకు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 2,38,270 (1.09%)కి పెరిగింది.
* ఒక రోజులో 3,18,609 మంది కోలుకోగా కొత్తకేసుల సంఖ్య భారీగా ఉండటంతో రికవరీ రేటు 81.90 శాతానికి పడిపోయింది. దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 37,23,446కి పెరిగింది.
* దేశంలో ప్రస్తుతం ప్రతి 10 లక్షల జనాభాకు సగటున 15,864 కేసులున్నాయి. తెలంగాణలో ఈ సగటు కంటే తక్కువ (12,377),  ఏపీలో ఎక్కువ (23,104) కేసులున్నాయి. ఈ సగటు గోవా (70,898), దిల్లీ (69,097), లద్ధాఖ్‌ (51,979), కేరళ (51,117)ల్లో ఎక్కువగా ఉంది. ఏప్రిల్‌ తొలివారంతో పోలిస్తే మే తొలివారం నాటికి కేసులు 318%, మరణాలు 594% పెరిగాయి.
* తొలి ఉద్ధృతి సమయంలో సెప్టెంబరు 19న గరిష్ఠంగా 1,247 మరణాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత అవి తగ్గుతూ వచ్చి ఫిబ్రవరి నాటికి 85కి పడిపోయాయి. అనంతరం క్రమేపీ వందల్లోకి మారిపోయాయి. ఏప్రిల్‌ 13 వరకూ వెయ్యి లోపునకే పరిమితమయ్యాయి. ఏప్రిల్‌ 14న తొలిసారి వెయ్యి దాటిన మరణాలు, ఏప్రిల్‌ 21న రెండు వేలు, 28న 3 వేలు మైలురాళ్లను దాటి మే 8 నాటికి 4 వేలకు చేరాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు