ఓటీఎస్‌ అమలు స్వచ్ఛందమే

ప్రధానాంశాలు

ఓటీఎస్‌ అమలు స్వచ్ఛందమే

లబ్ధిదారులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు

ప్రభుత్వం ఉత్తర్వులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా రుణం పొంది వివిధ గృహ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు వర్తింప చేస్తున్న వన్‌ టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) పథకాన్ని వాలంటరీ(స్వచ్ఛంద) విధానంలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రుణ చెల్లింపునకు లబ్ధిదారులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని స్పష్టం చేసింది. రుణాన్ని పొందిన లబ్ధిదారులు లేదా వారి వారసులకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘రుణ గడువు తీరిన వారు తీసుకున్న రుణం, దానిపై వడ్డీ కలిపి ఎంత ఉన్నా ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పురపాలక సంఘాల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థల్లో రూ.20 వేలు చెల్లించాలి. అయితే రుణం, వడ్డీ కలిపినా ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ప్రకటించిన నిర్దేశిత ధరల కంటే తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకాన్ని వినియోగించుకున్న వారికి నివాస స్థలానికి సంబంధించి సరైన పత్రాలు ఉంటే రెవెన్యూశాఖ టైటిల్‌ డీడ్‌ కమ్‌ పట్టాదారు పాసుపుస్తకాన్ని జారీ చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని డిసెంబర్‌ 21వ తేదీన ప్రారంభిస్తారు. అయితే గత నెల 15వ తేదీన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో స్థలాన్ని, ఇళ్లు కొనుగోలు చేసిన వారికి వర్తింప చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన జీవోలో వీరికి సంబంధించి స్పష్టత లేదు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని