వివేకా హత్యకేసులో ప్రాథమిక అభియోగపత్రం దాఖలు

ప్రధానాంశాలు

వివేకా హత్యకేసులో ప్రాథమిక అభియోగపత్రం దాఖలు

వివేకా హత్యకేసుకు సంబంధించిన పత్రాలను కారులో భద్రపరుస్తున్న సీబీఐ అధికారులు

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, పులివెందుల : మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు పులివెందులలోని జూనియర్‌ సివిల్‌ కోర్టులో మంగళవారం ప్రాథమిక అభియోగపత్రం(ప్రిలిమినరీ ఛార్జిషీట్‌) దాఖలు చేశారు. అయితే అందులో ఎవరి పేర్లు ఉన్నాయనే వివరాలు తెలియలేదు. ఈ కేసులో సునీల్‌కుమార్‌ యాదవ్‌ను అరెస్టు చేసిన తర్వాత 90 రోజుల గడువు సమీపిస్తుండడంతో సీబీఐ అధికారులు తాజాగా అభియోగపత్రం దాఖలు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో పులివెందులకు చెందిన సునీల్‌కుమార్‌ యాదవ్‌ను ఆగస్టు 4వ తేదీన సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. త్వరలో పూర్తిస్థాయి ఛార్జిషీట్‌ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కడప నుంచి ఆరుగురు సీబీఐ అధికారులు మధ్యాహ్నం 1.30 గంటలకు పులివెందుల కోర్టుకు వచ్చారు. కీలక పత్రాలను ఆరు సంచుల్లో తీసుకొచ్చారు. సీబీఐ అధికారుల బృందం తమ తరఫు న్యాయవాదితో కలిసి జడ్జి పవన్‌ని కలిసి ప్రాథమిక అభియోగపత్రాన్ని అందజేశారు. సాయంత్రం 4.45 గంటలకు సీబీఐ అధికారులు తమ వెంట తీసుకొచ్చిన సంచులతో కోర్టు నుంచి పులివెందులలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి, ఆ తర్వాత కడపకు వెళ్లారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని