
ప్రధానాంశాలు
ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక ఉగ్రవాది
ఆయన్నుంచి రక్షణకు రాజకీయ చైతన్యం అవసరం
పార్టీ శ్రేణులతో చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: ‘ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయి ప్రజలను ఎలా శాసిస్తున్నారో చూస్తున్నాం. ఆయన్నుంచి బయటపడాలంటే రాజకీయ చైతన్యం అవసరం. పేదలను ముంచుతూ, ప్రజలను నాశనం చేస్తున్న తీరును వివరించాలి’ అని పార్టీ శ్రేణులకు తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును గౌరవించకుండా ఆటవికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును జీర్ణించుకోలేక తెదేపా మద్దతుదారులపై దౌర్జన్యాలు, విధ్వంసాలకు దిగుతున్నారని ఆక్షేపించారు. పార్టీ ముఖ్యనేతలతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికార పార్టీకి కొందరు అధికారులు అండగా నిలిచి ఏకపక్షంగా వ్యవహరించారని, ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కనబరిచిన స్ఫూర్తినే పుర పోరులోనూ చూపాలని పిలుపునిచ్చారు. ‘తెదేపా తరఫున నామినేషన్లు వేసిన వారిని వైకాపావారు ప్రలోభపెట్టి, భయపెట్టి తమ వైపు పనిచేసేలా చేస్తున్నారు. అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. మున్సిపాలిటీలకు, గ్రామాలకు తేడా ఉంటుంది. అర్ధరాత్రి ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయటం పట్టణ ఎన్నికల్లో కుదరదు. బలవంతపు ఏకగ్రీవాలు, మైండ్‌గేమ్, ప్రలోభాలు, బలవంతపు నామినేషన్ల ఉపసంహరణల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. వైకాపా నాయకుల ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. ‘తెదేపా కార్యకర్తల జోలికొచ్చిన వారికి బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. అభ్యర్థికి తెలియకుండా నామినేషన్లు ఉపసంహరించే ప్రక్రియలపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలి. నామినేషన్ ఉపసంహరించుకోవాలంటే అభ్యర్థి తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.
* పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకున్న తప్పిదాలు పుర ఎన్నికల్లో పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచించారు. విశాఖలోనూ చాలా వార్డులు ఏకగ్రీవమవుతాయని విజయసాయిరెడ్డి మైండ్‌గేమ్ ఆడుతున్నారని ఆక్షేపించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడారు.
తంగిరాల సౌమ్య ఇంటిపై దాడి పిరికి చర్య
నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటిపై వైకాపా గూండాల దాడి పిరికిపంద చర్య అని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటనలో తెలిపారు. ‘పోలీసుల సహకారంతోనే మహిళా నేత ఇంటిపైకి 40 మంది రౌడీలు వెళ్లారు. నిందితులను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- మొతేరా పిచ్: కోహ్లీతో విభేదించిన కుక్
- రివ్యూ: చెక్
- భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసు
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!
- మీ అసలు స్వభావాన్ని గుర్తుచేసుకోండి!