మహిళలపై సీఎం కేసీఆర్‌ చిన్నచూపు

ప్రధానాంశాలు

మహిళలపై సీఎం కేసీఆర్‌ చిన్నచూపు

మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్త్రీలను అవమానిస్తున్నారని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు విమర్శించారు. స్త్రీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తూ శనివారం మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు గాంధీభవన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చీపుర్లు, తట్టా, పార పట్టుకుని ప్ల కార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల ఉపాధి అవకాశాలు పట్టించుకోవడం లేదన్నారు. తెరాస ప్రభుత్వానికి మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం, చిత్తశుద్ధి ఉన్నా ‘మహిళా బంధు’ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రోడ్డుపై బైఠాయించిన మహిళా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని