కుప్పంలో రాజీనామా చేసి చంద్రబాబు మళ్లీ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా

ప్రధానాంశాలు

కుప్పంలో రాజీనామా చేసి చంద్రబాబు మళ్లీ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా

మంత్రి కొడాలి నాని

ఈనాడు, అమరావతి: ‘చంద్రబాబు కుప్పంలో రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకొంటా. చంద్రబాబు బూట్లు తుడుచుకుంటూ ఉండిపోతా...’అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సవాల్‌ చేశారు. మంగళవారం ఆయన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ... ‘జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికలు పెడితే పారిపోయారు. తెదేపా బహిష్కరించినందువల్లే వైకాపా గెలిచిందని అంటున్నారు. కుప్పంలో నాలుగు జడ్పీటీసీ స్థానాల్లో 21వేల ఓట్లు చంద్రబాబుకు వస్తే, 89 వేల ఓట్లు వైకాపా సాధించింది. అంటే ఆయన ఎన్నికల బహిష్కరించినందు వల్లే కుప్పంలోని ప్రజలు మా పార్టీకి ఓట్లేశారా? ఎమ్పీటీసీలుగా 800 మంది వరకు తెదేపా వారు గెలిచారు. ఆయన్ను ధిక్కరించి వాళ్లంతా పోటీ చేసి గెలిచారా? వాళ్లందర్నీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారా...’ అని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని