బద్వేలు నియోజకవర్గంలో అభివృద్ధి ఏదీ?

ప్రధానాంశాలు

బద్వేలు నియోజకవర్గంలో అభివృద్ధి ఏదీ?

రాష్ట్ర ప్రభుత్వంపై సోము వీర్రాజు విమర్శ

బద్వేలు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ కడప జిల్లాలోని బద్వేలుకు ఏం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ఉపఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆయన భాజపా అభ్యర్థి సురేష్‌, ఎంపీ సీఎం రమేష్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ పులివెందుల అభివృద్ధికి రూ. మూడు వేల కోట్లు వ్యయం చేశారని, బద్వేలులో పైసాకూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా వెనుకబడిన బద్వేలు నియోజకవర్గంలో అభివృద్ధి జాడలు ఎక్కడా కనిపించటం లేదన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. ఈ ఉపఎన్నికల్లో భాజపాకు ఓటేసేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

* బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన మండలం నర్సాపురం గ్రామంలో తెదేపా నాయకుడు వెంకటరెడ్డిని సోము వీర్రాజు కలిశారు. భాజపా అభ్యర్థి సురేష్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఎంపీ సీఎం రమేష్‌, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని