తెదేపా గుర్తింపు రద్దుకు ఈసీని కోరతాం: సజ్జల

ప్రధానాంశాలు

తెదేపా గుర్తింపు రద్దుకు ఈసీని కోరతాం: సజ్జల

ఈనాడు, అమరావతి: ‘ముఖ్యమంత్రిపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు వారి పార్టీ వ్యక్తితో తిట్టించిన బూతులను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరిస్తాం. ఆ పార్టీ గుర్తింపు రద్దుచేయాలని కోరతాం’ అని రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘చంద్రబాబు దిల్లీలో ఫిర్యాదు చేస్తే.. వైకాపా వాళ్లు దౌర్జన్యాలు చేస్తారని అక్కడ అనుకోవచ్చు. కాబట్టి, ఆ తిట్ల అర్థం ఏంటో దిల్లీలోని వారికీ వివరిస్తాం’ అని చెప్పారు. గురువారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘తెదేపా కార్యాలయంలో కూర్చుని తిట్టిన వ్యక్తిని అడిగేందుకు వెళ్లారు. అక్కడ అతడు కనిపించకపోతే వెళ్లినవారిలో కొంతమంది ఆవేశపడ్డారు. వాళ్లంతా వైకాపా అభిమానులే అయి ఉంటారు, మేం దాన్ని కాదనం. దాని గురించి మాట్లాడే ముందు ఏ కారణంతో ఆ స్పందన వచ్చిందో చెప్పాలి కదా? మావాడు మాట్లాడింది తప్పే. కానీ, మీరు రాకపోతే బాగుండేది అని చంద్రబాబు చెప్పి ఉంటే అది మంచి లక్షణం. కానీ, ఆయన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు. కేంద్రం రాష్ట్రపతి పాలన పెట్టేస్తుందని చంద్రబాబు అత్యాశ. వెంటనే ఎన్నికలు వస్తే.. పవన్‌కల్యాణ్‌, భాజపా రెండువైపులా ఉండి, వామపక్షాలూ మోస్తే తాను అధికారంలోకి రావాలని చంద్రబాబు కలగంటున్నారు. దశాబ్దాలుగా గంజాయి సాగవడం లేదా? చంద్రబాబు హయాంలో అది బాగానే సాగిపోయింది. ఇప్పుడు జగన్‌ దాన్ని నియంత్రించేందుకు ఎస్‌ఈబీని ఏర్పాటుచేశారు. ఏడాదిలోనే 2.15 లక్షల కేజీల గంజాయిని సీజ్‌ చేశారు’ అని సజ్జల వివరించారు.


సంస్కారం అడ్డొస్తుందంటూనే.. అసభ్యకర దూషణ

ఎమ్మెల్యే సంజీవయ్య తీవ్ర పదజాలం

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: సంస్కారం అడ్డొస్తుందంటూనే.. తెదేపా అధినేత చంద్రబాబు, నేతలు లోకేశ్‌, పట్టాభి తదితరులను సూళ్లూరుపేట వైకాపా ఎమ్మెల్యే, తితిదే బోర్డు సభ్యుడు కిలివేటి సంజీవయ్య అసభ్య పదజాలంతో తీవ్రంగా దూషించారు. గురువారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడిచే తాము సంస్కారం వీడి మాట్లాడలేమంటూనే దుర్భాషలాడారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని