close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫలితం మార్పుపై గ్రామస్థుల కన్నెర్ర

విడవలూరు, న్యూస్‌టుడే: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, రీపోలింగ్‌ నిర్వహించాలంటూ నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు గ్రామస్థులు సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. ఆదివారం నాటి ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. భాజపా బలపరిచిన సర్పంచి అభ్యర్థి తుపాకుల వెంకటరమణమ్మ 100 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ప్రకటించిన కాసేపటికే.. వైకాపా మద్దతుదారు చౌటూరి వెంకటరమణమ్మ 10 ఓట్లతో విజయం సాధించారని అధికారులు ధ్రువీకరించడంపై ఆగ్రహించారు. ఆదివారం రాత్రి 12 గంటల వరకు ఫలితాలు ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని, న్యాయం చేయకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అక్రమాలను ఎంపీడీవో చిరంజీవికి వివరించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు