కెమెరా కంట.. మన పంట!

ప్రధానాంశాలు

కెమెరా కంట.. మన పంట!

సీసీ కెమెరాను వేరుసెనగ పంటలో పెట్టారేంటబ్బా...? అని బుర్రకు పని చెబుతున్నారా! మీ సందేహం రైటే.. కానీ ఇది సీసీ కెమెరా మాత్రమే కాదు.. అంతకుమించి. ఈ పరికరాలు అక్కడి వాతావరణ పరిస్థితి, పంట తెగుళ్లు, గాలిలో తేమను ఇట్టే పసిగడతాయి. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో వేసిన వేరుసెనగ పంటలో శాస్త్రవేత్తలు దీన్ని ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలో మదనపల్లె, శ్రీకాళహస్తి, నగరి ప్రాంతాల్లో వివిధ రకాల వాతావరణ పరిస్థితులు ఉండటంతో వాటిని అంచనా వేసి, రైతుకు ఎప్పటికప్పుడు సూచనలు చేసేందుకు దీన్ని ఏర్పాటు చేసి, పరీక్షిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా ఏ నెల ఎలాంటి పంటలకు అనుకూలం, నీటి తడి ఎంత ఇవ్వాలి, ఏ పరిస్థితుల్లో తెగుళ్లు ఆశిస్తున్నాయో.. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతు శ్రేయస్సుకు విస్తృత ప్రయోజనాల దృష్ట్యా దీన్ని ఏర్పాటు చేశారు.

   - ఈనాడు, తిరుపతి

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని