AP News: చంద్రబాబు ఇంటి చుట్టూ చీకట్లు.. జడ్‌ ప్లస్‌ భద్రత అంటే ఇదేనా?

ప్రధానాంశాలు

AP News: చంద్రబాబు ఇంటి చుట్టూ చీకట్లు.. జడ్‌ ప్లస్‌ భద్రత అంటే ఇదేనా?

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. ఆ ఇంటికి సమీపంలోని మార్గంలో చాలా వరకు వీధి దీపాలు వెలగడం లేదు. చంద్రబాబు ఇల్లు తాడేపల్లిలోని కట్ట దారికి వంద అడుగుల దూరంలో నది వైపు ఉంది. సుమారు 2 కిలోమీటర్ల పొడవుండే కట్ట దారిలో కొండవీటి వాగు దాటాక కొన్ని లైట్లు మాత్రం వెలుగుతున్నాయి. చంద్రబాబు ఇంటి సమీపం నుంచి మంతెన సత్యనారాయణ ఆశ్రమం వరకు గత నాలుగు రోజులుగా ఒక్క లైటూ వెలగడం లేదు. భద్రత సిబ్బంది సైతం చీకట్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న నాయకుడి ఇంటి వద్ద పరిస్థితి ఇలా ఉండటం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. కట్ట దారిలో మూడు అంచెలుగా ఉన్న చెక్‌పోస్టుల్లోని సిబ్బందిని ఈ విషయంపై ప్రశ్నించగా.. ‘పై అధికారులకు చెప్పాం.. వాళ్లు పట్టించుకోవడం లేదు’ అని సమాధానం ఇచ్చారు.

- ఈనాడు, అమరావతి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని