రైలు ప్యాంట్రీకార్లలో గ్యాస్‌ వ్యవస్థకు చెక్‌

ప్రధానాంశాలు

రైలు ప్యాంట్రీకార్లలో గ్యాస్‌ వ్యవస్థకు చెక్‌

రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే: రైలు ప్రయాణంలో ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే భారీగా ప్రాణనష్టం వాటిల్లుతోంది. గతంలో ప్యాంట్రీకార్లలో అగ్నిప్రమాదాల కారణంగా ప్రయాణికులు మరణించిన సంఘటనలు ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నీ ఎక్కువగా గ్యాస్‌లీక్‌ వల్లే సంభవిస్తున్నాయని అధికారులు తేల్చారు. తాజాగా గ్యాస్‌ను పూర్తిగా తీసివేసి ఆ స్థానంలో విద్యుదీకరణతో ప్రత్యేకంగా ప్యాంట్రీకార్లను రైల్వేశాఖ రూపొందించింది. ప్రస్తుతం లఖ్‌నవూలోని వర్క్‌షాప్‌లో వీటిని తయారు చేస్తున్నారు. ఇవి త్వరలో పట్టాలెక్కనున్నాయి. విజయవాడ డివిజన్‌ మీదుగా నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు సుమారు 70కిపైగా రైళ్లల్లో సరికొత్త ప్యాంట్రీకార్లు ఏర్పాటు చేయనున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని