వెలుగులు పంచాల్సింది.. వెలవెలబోయింది

ప్రధానాంశాలు

వెలుగులు పంచాల్సింది.. వెలవెలబోయింది

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం ప్రధాన రహదారి పక్కన కనిపించే పరిస్థితి ఇది. రూ.22 కోట్ల అంచనా వ్యయంతో 132/33 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి 2020 జనవరి 17న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.కోట్ల విలువ చేసే సామగ్రిని ఇక్కడికి తెచ్చారు. ఈ ఏడాది డిసెంబరు కల్లా పనులు ముగించాల్సి ఉంది. గుత్తేదారు మొదలుపెట్టినా కొవిడ్‌ కారణంగా ఆరంభంలోనే నిలిచిపోయాయి. దీంతో ఆ సామగ్రి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. సామగ్రి చోరీకి గురయ్యే అవకాశమున్నందున పూర్తి రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేయాల్సి ఉంది. 

- ఈనాడు, ఒంగోలు


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని