Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
PAK vs BAN: లిటన్‌ అజేయ శతకం

బంగ్లా 253/4

పాక్‌తో తొలి టెస్టు

చాట్టోగ్రామ్‌: లిటన్‌దాస్‌ (113 బ్యాటింగ్‌; 225 బంతుల్లో 11×4, 1×6) అజేయ సెంచరీ సాధించడంతో పాకిస్థాన్‌తో తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలిరోజు, శుక్రవారం ఆట చివరికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 253 పరుగులు చేసింది. లిటన్‌తో పాటు ముష్ఫికర్‌ రహీం (82; 190 బంతుల్లో 10×4) క్రీజులో ఉన్నాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లా.. 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో లిటన్‌-ముష్ఫికర్‌ జంట జట్టును ఆదుకుంది. ఈ జోడీ అబేధ్యమైన అయిదో వికెట్‌కు 204 పరుగులు జత చేసి బంగ్లాను మెరుగైన స్థితిలో నిలబెట్టింది. ఈ క్రమంలో లిటన్‌ 199 బంతుల్లో సెంచరీ సాధించగా.. ముష్ఫికర్‌ శతకం దిశగా సాగుతున్నాడు. పాక్‌ బౌలర్లలో షహీన్‌ అఫ్రిది, హసన్‌ అలీ, ఫహీమ్‌, సాజిద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.