
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్‌లకు ప్రభుత్వం రూ.250 కోట్ల గ్రాంటు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్‌లకు రూ.125,87,50,500, మండల పరిషత్‌లకు రూ.124,12,49,500 నిధులు విడుదలయ్యాయి. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.38,62,50,000, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.22,70,00,000 నిధులు ఉన్నాయి. నిధులను విడుదల చేయడంపై సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావులకు తెరాస స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు.