
ఆంధ్రప్రదేశ్
ఈనాడు, అమరావతి: సీనియర్ పాత్రికేయులు నరిశెట్టి ఇన్నయ్య సతీమణి కోమలి అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో మృతి చెందారు. కొద్దిరోజులుగా న్యూమోనియాతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వృత్తిపరంగా అధ్యాపకురాలైన ఆమె రచయిత్రి, అనువాదకులుగా పేరు సంపాదించారు. ఆమె మృతికి వయోధిక పాత్రికేయ సంఘం ప్రగాఢ సంతాపం తెలిపింది. ఇన్నయ్య కుటుంబసభ్యులకు సానుభూతి వ్యక్తం చేసింది.