
ఆంధ్రప్రదేశ్
ఇప్పటికే ఉన్న రూ.32 వేల కోట్లకు ఇది అదనం
ఈనాడు, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ ధాన్యం చెల్లింపుల కోసం వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పౌర సరఫరాల సంస్థ రూ.5 వేల కోట్ల రుణాన్ని తీసుకునేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే మంజూరైన రూ.32వేల కోట్ల రుణానికి ఇది అదనమని పేర్కొంది. హామీ కింద కమీషన్‌గా మొత్తం రుణంలో 2% చెల్లించాలని ఆదేశించింది. మిగిలిన చెల్లింపుల కోసం పౌర సరఫరాల సంస్థలో అందుబాటులోని నిల్వలను ఖాళీ చేయడం ద్వారా సమకూర్చుకోవాలని పేర్కొంటూ ఆ శాఖ ఎక్స్అఫిషియో కార్యదర్శి గిరిజా శంకర్ మంగళవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.