శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారిని సంపంగి ప్రాకారంలోని యాగశాలకు వేంచేపు చేసి, వైదిక క్రతువుల తర్వాత స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేసి, మాడవీధుల్లో ఊరేగించారు. ఈనెల 10న పూర్ణాహుతితో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈసారి పవిత్రోత్సవాలకు భక్తులను అనుమతించడంతో టికెట్లు పొందిన వారు పెద్దఎత్తున పాల్గొన్నారు.


శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ జయసూర్య

తిరుమలేశుడిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయసూర్య సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని