కొత్తపనసపాడులో పులి సంచారం

బొండపల్లి, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లాలో పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం బొండపల్లి మండలంలోని గిరిజన గ్రామం కొత్తపనసలపాడులో పులి పంజా విసిరింది. వారబోయిన పైడితల్లి, చంప చిన్నయ్యకు చెందిన 2 ఆవులపై దాడి చేసి చంపేసింది. మరో దూడను కొండపైకి ఈడ్చుకెళ్లింది. గ్రామస్థులు వెంటనే రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వచ్చిన వేటగాళ్లు ఆయా ప్రాంతాలను పరిశీలించారు. సమీప గ్రామాల్లోనే పులి ఉన్నట్లు నిర్ధారించారు. ప్రత్యేక ఆయుధాలతో కొండపై నిఘా వేశారు. సోమవారం రాత్రి నుంచి పులి గాండ్రింపులు వినిపించాయని, ఉదయాన్నే దాడి చేసిందని గ్రామస్థులు చెబుతున్నారు. కొత్తపనసపాడులో ఎస్‌ఐ రవి, అటవీశాఖాధికారి అప్పలరాజు పర్యటించారు.


మరిన్ని

ap-districts
ts-districts