‘సీఎం డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు

దర్శనం నిలిపివేతతో చిన్నారుల అవస్థలు

విజయవాడ వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: అధికారుల ప్రణాళికలేమితో ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం వచ్చిన సమయంలో ఘాట్‌రోడ్డులోని ఓంకారం మలుపు వద్ద భక్తులను ఆపేశారు. మధ్యాహ్నం 2.55గంటలకు పోలీసులు అన్ని క్యూలైన్లను నిలిపివేశారు. అప్పటికే వరుసల్లో ఉన్న కొందరు భక్తులు సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అధికారులు అప్రమత్తమై వారిని లోపలున్న క్యూలైన్లలోకి వదిలేశారు. సీఎం వెళ్లిపోయిన తర్వాత 4.20 నుంచి దర్శనాన్ని పునరుద్ధరించారు. గంటకుపైగా క్యూలైన్లు స్తంభించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చంటిపిల్లలతో ఉన్నవారు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు. దాహం, ఉక్కపోతతో కొందరు బయటకు రాగా, వాలంటీర్లు అప్రమత్తమై మంచినీటి ప్యాకెట్లు అందజేశారు. గతంలో ముఖ్యమంత్రుల పర్యటన ఉన్నా సర్వదర్శనంలోని భక్తులను అనుమతించే వారని పలువురు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి దర్శనానికి వెళ్తున్న సమయంలో రాజగోపురం పాయింట్‌ సమీపంలో కొందరు జై పవన్‌ అని నినదించగా, జగన్‌ వెనక్కి చూసుకుంటూ వెళ్లిపోయారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు