నత్తనడకన ఆరోగ్య ఉపకేంద్రాల పనులు

8,585 నిర్మాణాల్లో పావువంతే పూర్తి

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం 8,585 నూతన భవన నిర్మాణాల్లో 25% మాత్రమే పూర్తయ్యాయి. స్థలాల ఎంపిక, గుత్తేదారుల సమస్యల వల్ల 2,072 కేంద్రాల్లో పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. రూ. 1,538.68 కోట్ల వరకు ఖర్చుతో ఇప్పటికే ఉన్న 1,498 ఉన్న కేంద్రాలకు మరమ్మతులు, 8,585 కొత్త భవన నిర్మాణాల పనులను వైద్య ఆరోగ్య శాఖ చేపట్టింది. పంచాయతీరాజ్‌ శాఖ ఈ పనులు చేస్తోంది. ఇప్పటికి రూ. 623.88 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఇందులో రూ.100 కోట్ల వరకు బిల్లుల చెల్లింపులు జరగాల్సి ఉంది. 1,498 కేంద్రాల మరమ్మతులను పూర్తిచేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కొత్త కేంద్రాల్లో 1,050 వరకు స్థలాల సమస్యలు ఉన్నట్లు సమాచారం. మరో 1,050 వరకు గుత్తేదారుల కారణంగా జాప్యం జరుగుతోంది. 2,184 బేస్‌మెంట్‌ లెవెల్‌, 1,085 నిర్మాణాలు రూఫ్‌ వరకు వచ్చాయి. 1,295 కేంద్రాల నిర్మాణాలు చివరిదశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు పూర్తయినవి 303 మాత్రమే. మిగిలిన కేంద్రాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. డిసెంబరు నాటికి వీటిని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం లేఖలు రాసింది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు