శ్రీపద్మావతీ అమ్మవారికి నూతన సూర్యప్రభ వాహనం

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి నూతన సూర్యప్రభ వాహనం సమకూరింది. అమ్మవారి వాహన సేవకు రూ.3 కోట్ల వ్యయంతో 6 కిలోల బంగారాన్ని వినియోగించి తితిదే ప్రత్యేకంగా సూర్యప్రభ వాహనాన్ని తయారు చేయించింది. బుధవారం ఈ వాహనానికి తితిదే ఈవో ధర్మారెడ్డి దంపతులు, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం ప్రత్యేక పూజలు చేసి ఆలయ అధికారులకు అందజేశారు. ఈ నెల 26న ఉదయం జరిగే సూర్యప్రభ వాహన సేవలో ఈ వాహనాన్ని వినియోగించనున్నారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్‌ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని