బూస్టర్‌ డోసుగా కార్బెవ్యాక్స్‌ టీకా

కేంద్ర  ప్రభుత్వం అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌:  రెండు డోసుల కొవాగ్జిన్‌ లేదా కోవిషీల్డ్‌ టీకా తీసుకున్న వ్యక్తులు బూస్టర్‌ డోసు కింద బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌కు చెందిన కార్బెవ్యాక్స్‌ టీకా తీసుకోవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు డోసుల టీకా తీసుకొని ఆరు నెలలు పూర్తై ఉండాలి. వయస్సు 18 ఏళ్లకు మించాలి. అటువంటి వారు కార్బెవ్యాక్స్‌ టీకాను బూస్టర్‌ డోసుగా తీసుకోవచ్చు. టీకాలపై జాతీయ సాంకేతిక సలహా మండలికి చెందిన కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూపు చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ అనుమతి ఇచ్చినట్లు బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ గురువారమిక్కడ ఒక ప్రకటనలో వెల్లడించింది. కార్బెవ్యాక్స్‌ టీకాకు మనదేశంలో  ఇప్పటికే అత్యవసర వినియోగ అనుమతి ఉన్న విషయం తెలిసిందే. ఇప్పడు అదనంగా బూస్టర్‌ డోసుగా కూడా దీన్ని వినియోగించటానికి వీలుకలిగింది. ఇప్పటి వరకూ భారత ప్రభుత్వానికి 10 కోట్ల డోసుల కార్బెవ్యాక్స్‌ టీకాను సరఫరా చేసినట్లు బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ వెల్లడించింది. మనదేశంలో కొవాగ్జిన్‌ లేదా కోవిషీల్డ్‌ టీకా రెండు డోసుల తీసుకున్న వారికి బూస్టర్‌ డోసుగా ఇచ్చేందుకు అనుమతి పొందిన తొలి టీకా తమదేనని బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల అన్నారు. నేటి నుంచి ఈ టీకా బూస్టర్‌ డోసు కింద కొవిన్‌ యాప్‌లో బుక్‌ చేసుకున్న వారికి లభిస్తుందని వివరించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని