ఐఫోన్‌ 14 డెలివరీలు మరింత ఆలస్యం

చైనా ఐఫోన్‌ ఫ్యాక్టరీలో ఆందోళనలు
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోలు

యాపిల్‌ ఐఫోన్ల తయారీకి ప్రపంచంలోనే అతిపెద్దదైనా చైనా ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఆందోళన బాట చేపట్టారు. కరోనా బారిన పడిన ఉద్యోగులకు, ప్లాంటులో పనిచేస్తున్న సిబ్బందికి తగిన రక్షణ చర్యలు చేపట్టలేదంటూ వీరు తలపెట్టిన నిరసనలకు సంబంధించిన వీడియోలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. అందులో వేల మంది మాస్కులు ధరించి పోలీసులను ఎదుర్కొంటున్న దృశ్యాలున్నాయి. ఆ ప్లాంటులో 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. కరోనా నియంత్రణ చర్యల కరణంగా ఈ ప్లాంటు నుంచి ఐఫోన్‌ 14 డెలివరీలు ఆలస్యం కావొచ్చని యాపిల్‌ పేర్కొంది. తాజా పరిణామాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు