Uniparts IPO: నవంబరు 30న యూనిపార్ట్స్‌ ఇండియా ఐపీఓ

దిల్లీ: ఇంజినీరింగ్‌ సిస్టమ్స్‌ అండ్‌ సొల్యూషన్స్‌ సంస్థ యూనిపార్ట్స్‌ ఇండియా ఐపీఓ నవంబరు 30న ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు కొనసాగి డిసెంబరు 2న ముగుస్తుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లు నవంబరు 29 నుంచే బిడ్లు దాఖలు చేయొచ్చు. ఈ ఐపీఓలో కంపెనీ ఎలాంటి కొత్త షేర్లను జారీ చేయడం లేదు.

ప్రమోటర్లు 14,481,942 ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. ప్రమోటర్‌ సంస్థలైన కరణ్‌ సోనీ 2018 సీజీ-ఎన్‌జీ నెవాడా ట్రస్ట్‌, మెహర్‌ సోనీ 2018 సీజీ-ఎన్‌జీ ట్రస్ట్‌, పమేలా సోనీతో పాటు ప్రమోటర్లు అశోకా ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌, అంబాదేవీ మారిషస్‌ హోల్డింగ్‌ తమ వాటాల్లో కొంత భాగాన్ని ఐపీఓలో విక్రయించనున్నాయి. ఈ పబ్లిక్‌ ఇష్యూ పూర్తిగా ఓఎఫ్‌ఎస్‌ అయిన నేపథ్యంలో సమీకరించిన నిధుల్ని కంపెనీ వినియోగించుకునే ఆస్కారం లేదు. 2014, 2018లోనూ యూనిపార్ట్స్‌ ఐపీఓకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంది. సెబీ నుంచి అనుమతి కూడా లభించింది. కానీ, వివిధ కారణాలరీత్యా వాయిదా వేసుకుంది. యాక్సిస్‌ క్యాపిటల్‌, డీఏఎం క్యాపిటల్‌ అడ్వైజర్స్‌, జేఎం ఫైనాన్షియల్‌ తాజా ఐపీఓకి లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

యూనిపార్ట్స్‌ ఇండియా దాదాపు 25 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వ్యవసాయం, నిర్మాణం, అటవీ, మైనింగ్‌ వంటి రంగాలకు ఇంజినీరింగ్‌ సిస్టమ్స్‌ ఉత్పత్తులతో పాటు సేవలను అందజేస్తోంది. 3-పాయింట్‌ లింకేజ్‌ సిస్టమ్స్‌, ప్రెసిషన్‌ పార్ట్స్‌, పవర్‌ టేకాఫ్‌, హైడ్రాలిక్‌ సిలిండర్స్‌ ఈ కంపెనీ ప్రధాన ఉత్పత్తుల జాబితాలో ఉన్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని