నవ్వుల్‌.. నవ్వుల్‌..!

మాట తప్పొద్దు మరి!

టీచర్‌: కిట్టూ! నీకు ఎన్నిసార్లు చెప్పాలి.. హోంవర్క్‌ చేయని వారిని ఇంటికి పంపించేస్తానని.
కిట్టు: మీరు రోజూ ఇలాగే చెబుతున్నారు టీచర్‌. కానీ ఒక్కసారి కూడా పంపలేదు. కనీసం ఈ రోజైనా పంపించండి టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

నిజమే చెబుతున్నాగా..

(చంటి తప్పిపోయి.. పోలీసుకు దొరికాడు. అప్పుడు....)

పోలీస్‌: నువ్వు ఎక్కడుంటావ్‌ బాబూ!
చంటి: మా అమ్మానాన్నలతో అంకుల్‌.

పోలీస్‌: వాళ్లు ఎక్కడుంటారు.
చంటి:  నాతోనే..

పోలీస్‌: మీరందరూ ఎక్కడుంటారు.
చంటి:  కలిసే ఉంటాం అంకుల్‌.

పోలీస్‌: అది కాదు.. మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది.
చంటి:  బంటి వాళ్ల ఇంటి పక్కన.

పోలీస్‌: గుడ్‌.. బంటి వాళ్ల ఇల్లు ఎక్కడుంటుంది.
చంటి: మా ఇంటి పక్కనే అంకుల్‌.

పోలీస్‌: ఆఁ!!


ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని