సాయంత్రం 6.40 వరకు విచారణలు జరిపిన జస్టిస్‌ చంద్రచూడ్‌

దిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం సాయంత్రం 6.40 గంటల వరకు కేసుల విచారణ జరిపింది. సివిల్‌ సర్వీసులలోని మహిళల మాతృత్వ సెలవులకు సంబంధించిన ముఖ్యమైన కేసుపై విచారణను కోర్టు పనివేళల తర్వాతా కొనసాగించింది. మామూలుగానైతే ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 వరకు కోర్టు పనిచేస్తుంది. ఆ తర్వాత కూడా న్యాయమూర్తులు తమ ఛాంబర్లలో పని చేస్తుంటారనీ, ఒక్కోసారి ఇది అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఇటీవల ఒక సందర్భంలో చెప్పారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని