మేరఠ్‌ పేరును ‘నాథూరాం గాడ్సే నగర్‌’గా మారుస్తాం

హిందూ మహాసభ ప్రకటన

నగరపాలక సంస్థ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి మేయర్‌ అయితే మేరఠ్‌ నగరం పేరును ‘నాథూరాం గాడ్సే నగర్‌’గా మారుస్తామని హిందూ మహాసభ ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ ఓ మేనిఫెస్టో సైతం విడుదల చేసింది. భారత్‌ను హిందూ దేశంగా మార్చడమే తమ లక్ష్యమని.. గోమాతను కాపాడుకుంటామని అందులో పేర్కొంది. హిందూ మహాసభకు తగినన్ని కౌన్సిలర్‌ సీట్లు వచ్చి మా అభ్యర్థి మేయర్‌గా ఎన్నికైతే.. మేరఠ్‌ పేరును ‘నాథూరాం గాడ్సే నగర్‌’గా మార్పు చేస్తామని.. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు పండిట్‌ అశోక్‌ శర్మ తెలిపారు. నగరంలోని ఇతర ప్రాంతాలకూ హిందూ నేతల పేర్లు పెడతామని పేర్కొన్నారు.


మరిన్ని