Andhra News: గన్నవరంలో ప్రభల ఊరేగింపులో గొడవ.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

గన్నవరం: శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని కృష్ణా జిల్లా గన్నవరంలోని శ్రీలక్ష్మీ తిరుపతమ్మ ఆలయ వార్షిక సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రభలను ఊరేగించారు. జాతీయ రహదారి మీదుగా ఆలయం వైపునకు ప్రభలతో తరలివెళ్లారు. ఈ సమయంలో వెనక ట్రాక్టర్‌లో ప్రభను తీసుకొస్తున్న వ్యక్తి..  ముందు ప్రభను తీసుకెళ్తున్న వారిని త్వరగా దారివ్వాలని దురసుగా మాట్లాడటంతో వివాదం మొదలైంది. మరోవైపు డప్పు వాయిస్తున్న వ్యక్తి డప్పు ఓ యువకుడికి తాకడంతో గొడవ మరింత ఎక్కువైంది. ఒక్కసారిగా యువకులందరూ గుంపులుగా చేరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికులు చొరవ తీసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో సుమారు 2కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.


మరిన్ని

ap-districts
ts-districts