BSNL నుంచి లాంగ్‌ప్లాన్‌.. ఒక్కసారి రీఛార్జి చేస్తే 300 రోజులు బిందాస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) మరో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీర్ఘకాలం వ్యాలిడిటీ కోరుకునే వారికోసం పరిమితకాలపు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను పరిచయం చేసింది. రూ.2022 ప్లాన్‌తో ఒక్కసారి రీఛార్జి చేసుకుంటే 300 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్ని సర్కిళ్లకూ ఈ ప్లాన్‌ వర్తిస్తుందని BSNL పేర్కొంది. ఆగస్టు 31 వరకు మాత్రమే ప్లాన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

2022 ఆగస్టు 31లోపు రీఛార్జి చేసుకుంటే యూజర్లకు 300 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే దాదాపు 10 నెలల పాటు సేవలను ఆనందించొచ్చు. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా లభిస్తాయి. నెలకు 75 జీబీ చొప్పున డేటా లభిస్తుంది. పరిమితి పూర్తయ్యాక డేటా స్పీడ్‌ 40 కేబీపీఎస్‌కు పరిమితం అవుతుందని BSNL పేర్కొంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.2399, రూ.2999 ప్లాన్లపైనా అదనంగా మరో 75జీబీ డేటాను అందిస్తున్నట్లు BSNL పేర్కొంది. ఈ ఆఫర్‌ ఆగస్టు 31లోపు రీఛార్జి చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ఇతర టెలికాం కంపెనీలకు పోటీగా ప్లాన్లను తీసుకొస్తున్నామని, BSNL సెల్ఫ్‌కేర్‌ మొబైల్‌ యాప్‌, BSNL వెబ్‌సైట్‌, ఇతర వ్యాలెట్ల ద్వారా రీఛార్జి చేసుకోవచ్చని కంపెనీ సీఎండీ ప్రవీణ్‌ కుమార్‌ పుర్వార్‌ తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts