Corona: ఖర్గేకు మళ్లీ కరోనా పాజిటివ్‌.. నిన్న రాజ్యసభలో మాట్లాడిన ప్రతిపక్ష నేత!

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు మరోసారి కరోనా సోకింది. తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. ఇటీవల తనతో కాంటాక్టు అయిన వారంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఖర్గే నిన్న రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలోనూ ఖర్గే ప్రసంగించారు. వెంకయ్యనాయుడు సభలో ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్‌ ఓం బిర్లాతో పలువురు ఎంపీలు, ప్రముఖులు హాజరై వెంకయ్యనాయుడు సేవల్ని కొనియాడారు. అయితే, నిన్న సభలో పాల్గొని ప్రసంగించిన ఖర్గేకు కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. ీ ఏడాది జనవరిలోనూ ఖర్గే కరోనా బారిన పడ్డారు. లక్షణాలేమీ కనిపించికపోయినప్పటికీ కొవిడ్‌ సోకినట్టు తేలడంతో ఆయన హోంఐసోలేషన్‌లోనే ఉండి అప్పట్లో కోలుకున్నారు. 

(నిన్న వెంకయ్యనాయుడు వీడ్కోలు సభలో పాల్గొన్న ఖర్గే)


మరిన్ని

ap-districts
ts-districts