18న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) గురువారం ఉదయం 9గంటలకు విడుదల చేయనుంది. అక్టోబరు నెలకు సంబంధించిన కోటాను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లలో ఇవ్వనున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. అయితే వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని ఇప్పటికే తితిదే అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ నెలలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేసినట్లు తితిదే అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ దర్శనాన్ని బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని