Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-10-2022)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

చేపట్టేపనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగడానికై  వేంకటేశ్వరుణ్ణి పూజించాలి.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబందించిన శుభవార్త వింటారు. మీచుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉన్నది. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

ఎక్కువ సమయాన్ని అభివృద్ధికై కేటాయించండి. మరువలేను విజయాలు సొంతమవుతాయి. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దుర్గ ధ్యాన శ్లోకం చదవండి.

 మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.  

చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు వాటిని ప్రారంభించడంలో చిన్నచిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

మిశ్రమ ఫలితాలున్నాయి. శత్రువుల విషయంలో కాస్త అప్రమ్తత్తంగా ఉండాలి. సౌమ్యంగా ముందుకుసాగాలి. చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. ఇష్టదేవత స్తోత్రం పఠించడం మంచిది.

గొప్పకార్యాలు శుభఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.  సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే బాగుంటుంది.

కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. విష్ణుసహస్రనామం చదవడం లేదా వినడం చేస్తే మంచిది.

 

కొన్ని కీలక వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో కాస్త సంయమనంతో ఆచితూచి వ్యవహరించాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.

మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

ధర్మసిద్ధి ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో ఆగినపనులు పూర్తవుతాయి. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు