Crime News: మైనర్‌ బాలిక అంగీకరించలేదని వీడియో వైరల్‌.. నిందితులు అరెస్టు

స్టేషన్‌ ఘన్‌పూర్‌: గత కొంతకాలంగా మైనర్ బాలికను లోబర్చుకున్న వ్యక్తి.. ఆ తర్వాత బాలిక అంగీకరించలేదనే కోపంతో తనతో సన్నిహితంగా ఉన్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఏసీపీ డి.రఘుచందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లాలని ఓ గ్రామానికి చెందిన గుర్రం శ్యామ్‌(21) అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను పరిచయం చేసుకొని శారీరకంగా లోబర్చుకున్నాడు. తరువాత ఆమె నిరాకరించడంతో తనతో బాలిక సన్నిహితంగా మెలిగిన వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించాడు. బాలిక వినకపోవడంతో స్నేహితుల సాయంతో వాట్సాప్‌ గ్రూపుల్లో పలువురికి పంపి వైరల్‌ చేశాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు  ఆదివారం రాత్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్యామ్‌తో పాటు అతడి స్నేహితుడు సాంబరాజుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడి మరో నలుగురు స్నేహితులు (మైనర్లు) సైతం వాట్సాప్‌లో వీటిని వైరల్‌ చేశారు. వీరిపై కూడా పూర్తి విచారణ చేసి కేసు నమోదు చేస్తామని ఏసీపీ డి.రఘుచందర్‌ తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు