Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా

తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు, తీర్పులు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రూ.3,800 కోట్ల జరిమానా వేసింది. రెండు నెలల్లో ఈ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో డిపాజిట్‌ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టి.. పురోగతి చెప్పాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జోడో యాత్రకు భయపడే.. ఈ కుట్రలు కుతంత్రాలు: రేవంత్‌

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు భయపడి భాజపా కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈడీ పేరుతో పార్టీ నాయకులను వేధిస్తోందని విమర్శించారు. గాంధీ భవన్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. ముఖ్య నాయకులను ఈడీ కేసులతో భయపెట్టి కాషాయ పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘గాడ్‌ ఫాదర్‌’ అంటే ఇదీ.. టైటిల్‌ సాంగ్‌ విన్నారా!

చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father). మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబరు 5న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా టైటిల్‌ గీతాన్ని అభిమానులతో పంచుకుంది. కథానాయకుడి పాత్రకు అద్దం పట్టే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సఫారీలపై విజయం.. గెలుపోటములపై కెప్టెన్ల స్పందన ఇదీ!

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా దంచికొట్టింది. 16 పరుగుల తేడాతో గెలుపొంది మరో మ్యాచ్‌కు ముందే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌ ఓడినా సఫారీల పోరాటం ఆట్టుకుంది. ఈ నేపథ్యంలో గెలుపోటములపై ఇరు టీమ్‌ల కెప్టెన్లు, ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు గెలిచిన కేఎల్‌ రాహుల్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రుచికరమైన వంటకాలతో ఎయిరిండియా కొత్త మెనూ!

టాటాల యాజమాన్యంలోకి వెళ్లిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాకు తిరిగి పూర్వవైభవం తీసుకురావడంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పండగ సీజన్‌ సందర్భంగా దేశీయ విమాన సేవల్లో కొత్త ఆహార మెనూను ప్రవేశపెడుతున్నట్లు సంస్థ ప్రకటించింది. రుచికరమైన భోజనాలు, అధునాతన అపిటైజర్స్‌ (భోజనానికి ముందు ఇచ్చే పదార్థాలు), నాణ్యమైన డెజర్ట్స్‌ (భోజనానంతరం ఇచ్చే పదార్థాలు)ను కొత్త మెనూలో చేర్చినట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ములాయం కోసం ప్రత్యేక పూజలు..!

తీవ్ర అనారోగ్యంతో గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ కోసం ఆ పార్టీ శ్రేణులు ఉత్తర్‌ప్రదేశ్‌ వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాయి. క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (సీసీయూ)లో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
 

7. క్లాస్‌రూమ్‌లో ఆత్మాహుతి దాడి ఘటనలో 46మంది బాలికలు మృతి

రాజకీయ అస్థిరతతో అల్లాడుతున్న అఫ్గానిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లతో అక్కడ రక్తపాతం కొనసాగుతోంది. గత శుక్రవారం (సెప్టెంబర్‌ 30న) కాబూల్‌ నగరంలోని ఓ విద్యా కేంద్రంలోని తరగతి గదిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ ఘటనలో తొలుత 19మందికి పైగా మృతిచెందినట్టు అక్కడి అధికారులు పేర్కొనగా.. తాజాగా ఆ  సంఖ్య 53కి చేరినట్టు అఫ్గాన్‌లోని ఐరాస సహాయ మిషన్‌ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
 

8. బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ యూటర్న్‌.. సంపన్నులకు పన్ను కోతపై వెనక్కి!

బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన లిజ్‌ ట్రస్‌ అధికారం చేపట్టిన కొన్ని రోజులకే యూటర్న్‌ తీసుకున్నారు. సంపన్నులకు ఆదాయపు పన్ను కోత విధించాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గారు. సంపన్నులకు పన్నుల్లో రాయితీ కల్పిస్తామని ప్రధాని పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చిన ఆమె.. అందుకు అనుగుణంగా 10 రోజుల క్రితం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌లో దానికి సంబంధించిన ప్రకటన చేశారు. అయితే, మార్కెట్‌ ఒడుదొడుకులు, అధికార కన్జర్వేటివ్‌ పార్టీలో వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.  ₹ 10 వేలలోపు ధరలో 5జీ ఫోన్‌.. నార్డ్ సిరీస్‌లో తొలి స్మార్ట్‌వాచ్‌!

మిడ్‌-రేంజ్‌ మార్కెట్‌ లక్ష్యంగా మోటోరోలా, శాంసంగ్‌, లావా కంపెనీలు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేశాయి. బడ్జెట్‌ ధరకే 5జీ మోడల్‌ అంటూ లావా కంపెనీ కొత్త ఫోన్‌ను తీసుకొస్తే, వన్‌ప్లస్ కంపెనీ నార్డ్‌ సిరీస్‌లో తొలి స్మార్ట్‌వాచ్‌ను పరిచయం చేసింది. వీటి ఫీచర్లు, ధర వివరాలివే... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. T20 Worldcup: టీ20 వరల్డ్‌ కప్‌కు బుమ్రా దూరం

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న పురుషుల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా దూరమయ్యాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌నకూ దూరం కానున్నాడు. బుమ్రా ఫిట్‌నెస్‌పై వైద్య నిపుణుల నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బుమ్రా స్థానంలో జట్టులో ఎవరికి చోటు కల్పించనున్నారనే విషయాన్ని బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

ap-districts
ts-districts