Hyderabad: ఖైరతాబాద్‌లో కానిస్టేబుల్‌ వీరంగం.. మద్యం మత్తులో యువకులపై దాడి

హైదరాబాద్: మద్యం మత్తులో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించిన ఘటన ఖైరతాబాద్‌లో చోటుచేసుకుంది. సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ బి.శ్రీనివాస్‌ మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి ఖైరతాబాద్ ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయం వద్ద హల్‌చల్‌ చేశాడు. అంతటితో ఆగకుండా ద్విచక్ర వాహనంపై అటువైపుగా వెళ్తున్న యువకులపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, అతని స్నేహితులపై బాధిత యువకుల బంధువులు సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు