రజనీకి జోడీగా..?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథనాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘జైలర్‌’. ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌కి నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అటు సినీ పరిశ్రమలో, ఇటు అభిమానుల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తోందీ సినిమా. ఇందులోని నటీనటుల పేర్లు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం కథానాయిక తమన్నా ఇందులో ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. తదుపరి షెడ్యూల్‌లో తమన్నా.. రజనీతో ఆడిపాడనున్నట్టు సమాచారం. సినీవర్గాలు దీన్ని ధ్రువీకరించాల్సి ఉంది. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని