
Yashoda: యశోద సినిమా ఓటీటీ విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశాలు..!
హైదరాబాద్: సమంత నటించిన యశోద (Yashoda) చిత్రం ఇటీవల విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సమంత తన నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సరోగసి నేపథ్యంలో హరి-హరీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ వసూలు చేసింది. తాజాగా ఈ సినిమాకు సమస్య ఎదురైంది. యశోద ఓటీటీ రిలీజ్ ఆపాలంటూ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది.
విషయమేమిటంటే... యశోద సినిమాలో ఇవా హస్పిటల్(EVA hospital) పేరు దెబ్బతినేలా చూపించారని ఆ ఆసుపత్రి యాజమాన్యం కోర్టులో పిటిషన్ వేసింది. సినిమాలో అలా చూపించడం వల్ల ఆసుపత్రి పరపతి దెబ్బతిందని అందులో పేర్కొంది. ఈ సినిమా ఓటీటీ విడుదలను ఆపాలని కోరింది. దీంతో కోర్టు యశోద నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 19కు వాయిదా వేసింది. ఈ విషయంపై యశోద చిత్రబృందం స్పందించాల్సి ఉంది. శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థపై వచ్చిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్ కీలక పాత్ర పోషించారు.
యశోద మూవీ కథేంటంటే: యశోద (సమంత) మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆర్థిక అవసరాల రీత్యా సరోగసి పద్ధతిలో బిడ్డకి జన్మనివ్వడం కోసం డా.మధు (వరలక్ష్మి శరత్‌కుమార్)కి చెందిన ఈవా ఆస్పత్రిలో చేరుతుంది. ఒక ప్రత్యేక ప్రపంచంలా అనిపించే ఈవాలో జరిగే కొన్ని పరిణామాలు యశోదలో అనుమానం రేకెత్తిస్తాయి. తనతోపాటు బిడ్డలకి జన్మనివ్వడం కోసం ఆస్పత్రిలో చేరిన తోటి మహిళలు అనుమానాస్పద రీతిలో కనుమరుగైపోతుంటారు. ఇంతకీ ఆ మహిళలు ఏమవుతున్నారు? యశోద తన అనుమానాల్ని నివృత్తి చేసుకోవడం కోసం ఏం చేసింది? ఆ ఆ క్రమంలో ఆమెకి ఎలాంటి విషయాలు తెలిశాయి? ఇంతకీ ఈ మధు ఎవరు? ఈ ఆస్పత్రిలో సంఘటనలకీ, బయట జరిగిన మరో రెండు హత్యలకీ సంబంధమేమిటనేది మిగతా కథ.
మరిన్ని
Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్...
Vijay: ‘వారిసు’ చిత్ర నిర్మాతకు జంతు సంక్షేమ బోర్డు నోటీసులు..
OTT Movies: ఈ వారం ఓటీటీలో 9 చిత్రాలు.. 6 వెబ్‌సిరీస్‌లు.. అలరించే టాక్ షో!
Kamal Haasan: కమల్‌హాసన్ హెల్త్ అప్డేట్.. ఇంకా ఆస్పత్రిలోనే..!
Mahesh babu: కృష్ణ కన్నుమూత.. మహేశ్‌బాబు తొలి ఎమోషనల్ పోస్ట్.. లవ్యూ నాన్న..!


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs PAK: ఆసియా కప్ 2023.. గందరగోళానికి తెరపడాలంటే అదే సరైన విధానం: అక్రమ్
-
World News
USA: కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు.. ముగ్గురి మృతి!
-
Movies News
Ram Charan: నాన్న మౌనం వీడితే ఏమవుతుందో తెలీదు: హీరో రామ్‌చరణ్
-
General News
TTD: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు .. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Movies News
Chiranjeevi: ఆ మార్క్ చేరుకోవడం ఆషామాషీ కాదు: చిరంజీవి
-
India News
Gauhati HC: ‘జీన్స్’తో కోర్టు విచారణకు.. సీనియర్ న్యాయవాదికి ఊహించని అనుభవం!