కేశవులుకు స్వామినాథన్‌ ఫౌండేషన్‌ పురస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్‌ కేశవులుకు అంతర్జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ వ్యవసాయం, ఆహారభద్రత రంగంలో పనిచేసేవారికి ఇచ్చే ‘ఎం.ఎస్‌.స్వామినాథన్‌ అవార్డు-2022’కు  కేశవులును ఎంపిక చేసింది. సోమవారం చెన్నైలో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఈ పురస్కారాన్ని కేశవులుకు అందజేశారు. ఇప్పటివరకూ ఈ అవార్డును అందుకున్న 8 మందిలో కేశవులు, ఆర్‌.ఎస్‌.పరోడా మాత్రమే భారతీయులు. విత్తన శాస్త్రవేత్తగా విత్తనరంగ అభివృద్ధికి కేశవులు చేసిన అపార కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపికచేసినట్లు స్వామినాథన్‌ ఫౌండేషన్‌ తెలిపింది. అంతర్జాతీయ విత్తన పరీక్షల ఏజెన్సీ(ఇస్టా)కి తొలిసారి అధ్యక్షుడిగా ఇటీవల కేశవులు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ పదవికి ఎంపికైనా తొలి ఆసియా దేశాల ప్రతినిధి కూడా ఆయనే. గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి మాట్లాడుతూ 94 ఏళ్లుగా ఐరోపా దేశాల ఆధిపత్యంలో ఉన్న ఇస్టాకు అధ్యక్షుడిగా, స్వామినాథన్‌ ఫౌండేషన్‌ అవార్డుకు ఎంపికవడం అసాధారణమని కేశవులును ప్రశంసించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని