పే స్కేలు ఇచ్చేవరకు సమ్మె విరమించేది లేదు

ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన వీఆర్‌ఏ ఐకాస

ఈనాడు, హైదరాబాద్‌: వీఆర్‌ఏలకు పే స్కేలు ఇచ్చే వరకు సమ్మె విరమించేదే లేదని వీఆర్‌ఏ ఐకాస పేర్కొంది. ఆదివారం నగరంలో నిర్వహించిన ఐకాస సమావేశం అనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది. పే స్కేలు స్థానంలో గౌరవ వేతనం ఒప్పుకునేది లేదని, ఉద్యోగ క్రమబద్ధీకరణ చేపట్టాలని కోరింది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఐకాస నాయకులను పిలిచి చర్చించాలని కోరింది. సమ్మె కొనసాగింపు, ఉద్యమ కార్యాచరణలో భాగంగా 15వ తేదీ నుంచి 26 వరకు దశలవారీ ఆందోళనల కార్యక్రమాలను ప్రకటించింది. 25, 26వ తేదీల్లో కలెక్టరేట్ల ఎదుట వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఐకాస స్పష్టం చేసింది. కార్యక్రమంలో నాయకులు ఎం.రాజయ్య, ఎస్కే దాదేమియా, సాయన్న, వెంకటేశ్‌, రఫీ, రాములు పాల్గొన్నారు.

సర్దుబాటులో నిబంధనల ఉల్లంఘన: వీఆర్వోల సంఘం

రెవెన్యూశాఖ నుంచి వీఆర్వోలను బలవంతంపై ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడం దారుణమైన అంశమని తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. లోపాలతో కూడిన జీవో ఎంఎస్‌.నం.121 ద్వారా ఎటువంటి పదోన్నతులు, సర్వీసు నిబంధనలు వర్తించని విభాగాలు, సొసైటీలు, కార్పొరేషన్లకు కూడా వీఆర్వోలను కేటాయించడం దారుణమని తెలిపింది. వీఆర్వో వ్యవస్థ రద్దు చట్టంలోనూ ఐచ్ఛికాలు కల్పించి ఇతర శాఖల్లోకి వీఆర్వోలను సర్దుబాటు చేస్తామని పేర్కొన్న హామీని అమలు చేయాలని కోరింది. ప్రభుత్వం సరైన విధానం చేపట్టకపోవడంతోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని