బధిరుల గోస వినే వారెవరు..!

 ఇంటర్‌ కళాశాల ఒక్కటే.. డిగ్రీ కాలేజీలు లేనే లేవు

ఈనాడు, నల్గొండ: వారంతా చెవులు వినిపించని...మాటలు రాని బధిరులు. చాలా మంది విద్యార్థులు ఇంటర్‌ అనంతరం అర్ధాంతరంగా చదువులు ఆపేస్తున్నారు. వారి చదువులకు హైదరాబాద్‌లోని మలక్‌పేట, నల్గొండ జిల్లా మిర్యాలగూడ, కరీంనగర్‌లలో మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ఉన్నాయి. వాటి నుంచి ఏటా 500మంది విద్యార్థులు పదోతరగతి పూర్తి చేస్తున్నారు. తర్వాత ప్రత్యేకంగా ఇంటర్‌ తరగతులు ఉన్నది ఒక్క నల్గొండ జిల్లా మిర్యాలగూడలోనే. అక్కడ ఏటా 180 మంది చదువుతున్నారు. ప్రభుత్వ రంగంలో డిగ్రీ కళాశాలలు ఎక్కడా లేవు. ప్రైవేటుగా ఇంటర్‌, డిగ్రీ చదువులకు హైదరాబాద్‌, సూర్యాపేట, హనుమకొండలలో మూడు కళాశాలలున్నాయి. ఆర్థిక స్థోమత ఉన్న వారు అక్కడికి వెళ్లి చదువుకొంటున్నారు. ‘‘మాకు మరికొన్ని చోట్ల ఇంటర్‌, డిగ్రీ చదువుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. సాధారణ విద్యార్థులతో కలిపి కాకుండా విడిగా వసతి ఏర్పాటు చేయాలి’’ అని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ‘నేను మిర్యాలగూడలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు పూర్తి చేశాను. బీకాం కంప్యూటర్‌ చేయాలని ఉన్నా ఆర్థిక స్థోమత లేకపోవడంతో చదువు ఆపేయాల్సి వస్తోంది’’ అని సూర్యాపేట జిల్లా గరిడేపల్లి విద్యార్థిని సోని వివరించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో బధిరులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులు ఉండాలని విద్యాహక్కు చట్టంలో ఉన్నా అది సరిగా అమలవడం లేదు. విభజన అనంతరం రాష్ట్రంలో 616 మందిని నియమించాల్సి ఉన్నా.. ఈ ప్రక్రియలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు.


ఒక్క సమావేశమూ లేదు

ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ సర్కారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో గతంలో ముగ్గురితో కమిటీ వేసింది. అందులో నేనూ సభ్యుడినే. ఇప్పటి వరకు ఒక్క సమావేశమూ నిర్వహించలేదు.

-ఎన్‌.రామకృష్ణ, ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని