
వర్సిటీలు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలుగా ఎదగాలి
ఐసీఏఆర్ డీడీజీ అగర్వాల్
ఈనాడు, హైదరాబాద్: దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలుగా ఎదగాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) డాక్టర్ ఆర్.సి.అగర్వాల్ ఆకాంక్షించారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి వీలుగా ఇప్పటికే నూతన సిలబస్‌ను సిద్ధం చేశామని వివరించారు. హైదరాబాద్ సమీపంలోని కన్హ శాంతి వనంలో గత మూడు రోజులుగా జరుగుతున్న అఖిల భారత వ్యవసాయ విశ్వవిద్యాలయాల వీసీల సమావేశం ఆదివారం ముగిసింది. ఈ సమావేశంలో డాక్టర్ ఆర్.సి.అగర్వాల్ మాట్లాడుతూ.. వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల విశ్వవిద్యాలయాలు ప్రతిభ కలిగిన విద్యార్థులను ఆకర్షించే కేంద్రాలుగా మారాలని సూచించారు. వ్యవసాయ విద్యలో మూడు వారాల నిడివి కల యోగా, ధ్యానం ఫౌండేషన్ కోర్సు, ప్రకృతి వ్యవసాయం, పరిశోధనలకు సంబంధించి ప్రత్యేక డిగ్రీ కోర్సుల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేశామని తెలిపారు. ఈ సందర్భంగా హార్ట్ ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, ఐసీఏఆర్ల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. సమావేశంలో కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బి.నీరజాప్రభాకర్తోపాటు సమావేశానికి హాజరైన 46 వర్సిటీల వీసీలు, వారి సతీమణులు బతుకమ్మ ఆడి సందడి చేశారు. వీసీ డాక్టర్ బి.నీరజాప్రభాకర్ వారికి బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virat Kohli: నేను కూడా జంక్‌ఫుడ్ తిన్నా.. కానీ: విరాట్ కోహ్లీ
-
India News
Nirmala Sitharaman: బడ్జెట్ వేళ..ప్రత్యేక ఆకర్షణగా నిర్మలమ్మ చీరకట్టు..!
-
Politics News
Kotamreddy: అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే?: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Movies News
Varun Tej: మెగా నివాసంలో పెళ్లి బాజాలు.. వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు స్పష్టత
-
Ap-top-news News
Andhra News: బాలిక కడుపు నుంచి కిలోకు పైగా జుత్తు తొలగింపు