
విలీనానికి రష్యా ‘డ్యూమా’ ఆమోదం
ఖేర్సన్‌లోనూ ఉక్రెయిన్ దళాల ముందంజ
కీలక సైనిక కమాండర్‌పై పుతిన్ వేటు
కీవ్: ఉక్రెయిన్.. రష్యాకు చెమటలు పట్టిస్తోంది. ఖర్కీవ్‌లో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకొని.. లీమన్ నగరాన్నీ హస్తగతం చేసుకున్న ఉక్రెయిన్ దళాలు.. ఇప్పుడు ఖేర్సన్‌పై కన్నేశాయి. అక్కడా పుతిన్ సేనలను వెనక్కి నెడుతూ ముందుకు దూసుకుపోతున్నాయి. ఉక్రెయిన్ భూభాగాలైన దొనెట్స్క్, లుహాన్స్, జపోరిజియాలతో పాటు.. ఈ ఖేర్సన్ను కూడా రష్యా సమాఖ్యలోకి చేరుస్తున్నట్లు పుతిన్ ఇటీవల సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ విలీనానికి సోమవారం ఆ దేశ పార్లమెంటులోని దిగువ సభ డ్యూమా కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఖేర్సన్లో ఉక్రెయిన్ దళాల దూకుడు రష్యాను కలవరపరుస్తోంది. శత్రువు నెమ్మదిగా ముందంజ వేస్తున్నట్లు అధికారికంగా అంగీకరించింది. మరోవైపు లీమన్ నగరం చేజారడంపై ఆగ్రహంగా ఉన్న పుతిన్.. కీలక వెస్టర్న్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ అలెగ్జాండర్ జురొవ్లోవ్పై వేటు వేశారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించినట్లు వార్తలు వస్తున్నాయి.
విలీనం సరే.. హద్దులు ఎక్కడ?
ఉక్రెయిన్ భూభాగాలను విలీనం చేస్తూ మాస్కో అట్టహాసంగా చేసిన విలీన ప్రక్రియపై రష్యాలోనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే పేరుకు విలీనమైతే చేశారు గానీ.. జపోరిజియా, ఖేర్సన్ల సరిహద్దులెక్కడో తెలియని పరిస్థితి నెలకొంది. స్థానిక నివాసులతో చర్చించి హద్దులను ఖరారు చేస్తామని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలపడం గమనార్హం.
అణువిద్యుత్కేంద్ర అధిపతిని వదిలేశారు
రష్యన్లు తాము నిర్బంధంలోకి తీసుకున్న జపోరిజియా అణు విద్యుత్కేంద్ర డైరెక్టర్ జనరల్ ఇహోర్ మురాషోవ్‌ను విడుదల చేశారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ధ్రువీకరించింది. మురాషోవ్ సురక్షితంగా తన కుటుంబసభ్యులను చేరుకున్నారని ఐఏఈఏ అధిపతి రఫెల్ గ్రాసీ తెలిపారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!