అమెరికాలో మళ్లీ తుపాకీ పేలింది

వర్జీనియా వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పులు
షూటర్‌ సహా ఏడుగురి మృతి

చెసాపీక్‌ (వర్జీనియా): అగ్రరాజ్యాన్ని మరో తుపాకీ కాల్పుల ఘటన కుదిపేసింది. మంగళవారం రాత్రి వర్జీనియా చెసాపీక్‌ ప్రాంతంలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. కాల్పులు జరిపిన స్టోర్‌ మేనేజర్‌ కూడా చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. కాల్పుల సంఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని వాల్‌మార్ట్‌ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని