close

ఫీచర్ పేజీలు

అదిగదిగో జైపుర్‌ అంగడి

లెట్స్‌ గో

దసరా పండగకు సరదాలు జోడించాలని భావిస్తున్నారా? సెలవుల్లో ఏ నెలవుకో వెళ్లి హాయిగా గడపాలనుకుంటున్నారా..? అయితే రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌కు వెళ్లండి. కోటల వైభవం చూడండి. ఒంటెలపై విహరించండి. షాపింగ్‌ ఫెస్టివల్‌లో నచ్చినవన్నీ కొనేయండి. ఏటా జరిగే జైపుర్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ను చూసేందుకు విదేశీ పర్యాటకులు సైతం వస్తారు. రాజస్థాన్‌లోని పర్యాటక కేంద్రాలను చుట్టేస్తూ.. జైపుర్‌ అంగళ్ల సందడి చూస్తారు. నెల రోజులు జరిగే ఫెస్టివల్‌లో రత్నాలు, ఆభరణాలు, చీరలు, హస్తకళాకృతులు, బొమ్మలు ఇలా ఎన్నో వస్తువులు వివిధ రకాల డిజైన్లలో లభిస్తాయి. అడుగడుగునా రాజస్థానీ సంప్రదాయం పలకరిస్తుంది. ఎడారి వంటకాల ఘుమఘుమలు మనసును కట్టిపడేస్తాయి.

ఎప్పుడు?: సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 23 వరకు
ఎక్కడ?: జైపుర్‌
చేరుకునేదిలా: హైదరాబాద్‌ నుంచి జైపుర్‌కు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి రైళ్లున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు