close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లక్ష మందికి ‘కారణాలు తెలియని’ జ్వరాలు!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. ఈ ఏడాది ఇప్పటివరకు కారణాలు తెలియని జ్వరాల కేసులు 1,02,452 నమోదయ్యాయని వెల్లడించింది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వారిలో జ్వరపీడితులనూ కలిపితే ఈ సంఖ్య దాదాపు 2లక్షల వరకు నమోదై ఉండొచ్చని అంచనా. ఈ నెలలోనూ 15,201 జ్వరం కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అలానే ఈ ఏడాది ఇప్పటివరకు 2,02,001 మందికి శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. అత్యధికంగా హైదరాబాద్‌లోనే 49,182 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ఆకస్మికంగా తలెత్తిన శ్వాసకోశ వ్యాధులే (అక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌) అని వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ తరహా సమస్యలున్న వారిలో కరోనా ప్రమాదం ఎక్కువ కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. రాబోయే చలికాలంలో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు