close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
దానిమ్మ గింజల్లా మెరవాలంటే!

మీ దంతాలు పసుపురంగులోకి మారి అసహ్యంగా కనిపిస్తున్నాయా... దాంతో నలుగురిలో నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారా... నవ్వాలంటే నామోషీగా ఉందా.... అవునండి అవును అంటారా... అయితే ఈ వంటింటి చిట్కాలు ప్రయత్నించండి.

స్ట్రాబెర్రీ... ఒకట్రెండు పండ్లను మెత్తగా  చేసి.. ఈ గుజ్జుతో దంతాలపై టూత్‌బ్రష్‌తో రెండు మూడు నిమిషాలపాటు గట్టిగా తోమండి. వారంలో రెండుసార్లు ఇలాచేస్తే మీ పళ్లు తెల్లగా మెరుస్తాయి.
వంటసోడా... చెంచా చొప్పున నిమ్మరసం, వంటసోడాను కలపాలి. ఈ మిశ్రమాన్ని దంతాలపై రాసి చేతివేలితో రెండు, మూడు నిమిషాలపాటు మృదువుగా రుద్దాలి. ఇలా చేస్తే పంటిపై ఉండే పాచి/గార తొలగిపోయి దంతాలు తళతళా మెరుస్తాయి. అయితే దంతాలపై గట్టిగా రుద్దితే చిగుళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది.
అరటిపండు తొక్క...  దీని లోపలి భాగంతో దంతాలపై మృదువుగా రుద్ది చూడండి. ఇలా రోజూ రెండుమూడు నిమిషాలపాటు చేస్తే పళ్లు శుభ్రపడతాయి.
యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌... కప్పు నీటిలో రెండు చెంచాల యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ వేసి ఆ నీటితో పుక్కిలించండి. ఇలా రోజూ చేస్తే పళ్లపై పేరుకున్న పాచితో పాటు నోటి దుర్వాసనా దూరమవుతుంది.

ఆవనూనె... పావు చెంచా ఉప్పులో రెండు చుక్కల ఆవనూనె వేసి ఈ మిశ్రమాన్ని దంతాలపై రాయాలి. ఇలా చేస్తే పళ్లు శుభ్రపడటమే కాకుండా బలంగా మారతాయి.


మరిన్ని