close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అభివృద్ధి ఆధారంగా మార్కెట్‌ విలువలు

గ్రామాలు, పట్టణాలవారీ వివరాల సేకరణ  
శాస్త్రీయ పద్ధతిలో యంత్రాంగం కసరత్తు

ఈనాడు, అమరావతి: పట్టణాలు, గ్రామాల్లోని ప్రాధాన్య ప్రదేశాలనుబట్టి మార్కెట్‌ విలువలను సవరించనున్నారు. వాటి అనుకూలతలను పరిశీలించి ఆయా ప్రాంతాలను గ్రిడ్లుగా, ఉపగ్రిడ్లుగా విభజిస్తారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఒక పట్టణం/గ్రామంలో ఒకే మార్కెట్‌ విలువ ఉండదు. ప్రాధాన్య ప్రాంతాలకు ఒక విధంగా, అప్రాధాన్య స్థలాలకు, ఆవాసాలకు మరోలా మార్కెట్‌ విలువలు ఉంటాయి.
 ప్రాధాన్యత గుర్తింపు ఇలా..
ఆయా ప్రాంతాలు జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులకు ఎంత దూరంలో ఉన్నాయనేది పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే పట్టణంలోని రద్దీ ప్రాంతం నుంచి ఉన్న దూరంపైనా అధ్యయనం చేస్తారు. అక్కడ పరిశ్రమలు, నీటిపారుదల సౌకర్యాలు, ఇతర అభివృద్ధి అంశాలను గుర్తిస్తారు. ‘మీభూమి’ వెబ్‌సైట్‌లో నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) చూపించే భువన్‌ 2డీ మ్యాపులు, ఏపీ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ఏపీ స్యాక్‌) వారు జారీ చేసిన డిజిటల్‌ మ్యాప్‌లు, ఏపీ భూనక్షా వెబ్‌సైట్‌లోని ఎఫ్‌ఎంబీ క్యాడస్ట్రల్‌ మ్యాపులు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అభివృద్ధి చేసిన జీఐఎస్‌ వంటి శాస్త్రీయ సాంకేతిక సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. వీటిపై లోతుగా అధ్యయనం చేశాక మార్కెట్‌ విలువను ఖరారు చేస్తారు.
 ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు
ఏటా ఆగస్టులో పట్టణ/నగర/అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రాంతాల్లో మార్కెట్‌ విలువలను సవరిస్తారు. గ్రామీణంలో రెండేళ్లకోసారి ఈ ప్రక్రియ చేపడతారు. ఈ ఏడాది రెండు కేటగిరీల్లోనూ మార్కెట్‌ విలువలు సవరిస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు నుంచి మార్కెట్‌ విలువలను సవరించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ పెద్దఎత్తున కసరత్తు చేస్తోంది. భూసంబంధిత అంశాలతో ముడిపడిన రెవెన్యూ, పరిశ్రమలు, నీటిపారుదల, వ్యవసాయ, పంచాయతీరాజ్‌, పరిశ్రమలు, గృహనిర్మాణం, మత్స్యశాఖ, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌, ఇతర శాఖలను ఇందులో భాగస్వామ్యం చేస్తోంది. వీరి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటోంది.
 కొత్త సౌకర్యాలు
ఈ విధానంలో మార్కెట్‌ విలువను సవరిస్తే భూసేకరణ సమయంలో  నష్టపరిహారం చెల్లింపు సులువవుతుంది. హెచ్చుతగ్గులు ఉండవు. ప్రస్తుతం మున్సిపల్‌/కార్పొరేషన్‌వారు సమీపంలో ఉన్న అద్దెలను పరిగణనలోకి తీసుకొని ఆస్తిపన్ను ఖరారు చేస్తున్నారు. గ్రిడ్లవారీగా మార్కెట్‌ విలువను సవరించాక దాని ఆధారంగానే ఆస్తిపన్ను విధిస్తారు.

సాంకేతికతను ఉపయోగిస్తున్నాం

ప్రామాణిక సూచిత కమతం (స్టాండర్డ్‌ రిఫరెన్స్‌ పార్సిల్‌) ఆధారంగా ఆయా ప్రాంతాల ప్రాధాన్యాలనుబట్టి మార్కెట్‌ విలువను సవరించేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. దీనికి శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. భూసంబంధిత శాఖల భాగస్వామ్యంతో నిర్దిష్టంగా విలువ ఖరారు చేయనున్నాం. వీటి ఆధారంగానే భవిష్యత్తులో ఆస్తులకు స్మార్ట్‌ కార్డులు అందించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నాం.

-శేషగిరిబాబు, ఐజీ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.