close

ఫీచర్ పేజీలు

మీ డేటా చిక్కదు.. దొరకదు

రాజగోపాలపేట (నంగునూరు) న్యూస్‌టుడే: పాలిటెక్నిక్‌ డిప్లొమా ఉత్రీర్ణులైన అభ్యర్థుల ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ ఈసెట్‌ అభ్యర్థుల మొదటి దశ నిజధ్రువపత్రాల  పరిశీలన బుధవారం ముగిసింది. ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లించి, స్లాట్‌ బుక్‌ చేసుకున్న అభ్యర్థుల నిజ ధ్రువపత్రాలను ఈ నెల 24వ తేదీ నుంచి పరిశీలించారు. ఇందుకు రాజగోపాలపేటలోని పాలిటెక్నిక్‌లో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకున్న 125 మంది అభ్యర్థుల నిజ ధ్రువపత్రాలను పరిశీలన చేసినట్లు పాలిటెక్నిక్‌ ప్రధానాచార్యుడు సూర్యనారాయణ తెలిపారు. అభ్యర్థుల సెల్‌ఫోన్‌కు వచ్చిన లాగిన్‌ ఐడీ ఆధారంగా పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకుని నిజధ్రువపత్రాలను పరిశీలన చేయించుకున్న అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు