close

తాజా వార్తలు

అక్షయ్‌ సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌కు సమయస్ఫూర్తి ఎక్కువ. ఆయనలో హాస్య చతురత కూడా చాలానే ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రెస్‌ మీట్‌ పెట్టారు. ఇందులో భాగంగా ఓ పాత్రికేయుడు స్టేజ్‌ మీద ఉన్నవారి మాటలను రికార్డ్‌ చేయాలని ఫోన్‌ను వారి ముందు పెట్టాడు. దాన్ని సైలెంట్‌లో పెట్టడం మర్చిపోయాడు. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి కుల్హరీ మాట్లాడుతుండగా అది ఒక్కసారిగా మోగింది. వెంటనే అక్షయ్‌ కుమార్‌ ఫోన్ తీసుకుని ‘హలో..మేం విలేకరులు సమావేశంలో ఉన్నాం. నేను అక్షయ్‌ను మాట్లాడుతున్నాను. ఇది పూర్తయ్యాక నేను ఫోన్‌ చేస్తాను’ అని మాట్లాడి ఫోన్‌ కట్‌ చేశారు. అక్షయ్‌ చేసిన పనికి అక్కడున్న వారందరూ కాసేపు ఆశ్చర్యపోయి తర్వాత నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు అక్షయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకే ఆయన సూపర్‌స్టార్‌ అయ్యారంటూ కామెంట్లు పెడుతున్నారు.

అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ ఈ నెల 15న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరీ, నిత్యా మేనన్‌, తాప్సీ కీలక పాత్రలు పోషించారు.మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు